Followers

జి.మాడుగుల గురుకులంలో కరోనా కలకలం

 జి.మాడుగుల గురుకులంలో కరోనా కలకలం

పెన్ పవర్,  విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీలో  రెండో విడత కరోనా మహమ్మారి విలయ తాండవం ఆడుతుంది. ఎక్కడ ఎక్కడ కరోనా కేసులు నమోదవుతున్నాయి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. జి.మాడుగుల మండల కేంద్రంలో గల గురుకుల ఆశ్రమ కళాశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నమోదయింది. ఈనెల 17వ తేదీన గురుకుల కళాశాల లో 50 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నమోదయింది. దీంతో  ఆశ్రమ నిర్వాహకులు  కళాశాలను  శానిటైజ్ చేస్తున్నారు.  గురుకుల ఆశ్రమ వర్కర్ కి కూడా  కరోనా పాజిటివ్ వచ్చినట్లు  తెలిసింది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...