సునీల్ నాయక్ ది పక్కా ప్రభుత్వ హత్యే..!
తెలంగాణ ఉధ్యమకారుడు బధావత్ సారయ్య నాయక్
రామగుండం, పెన్ పవర్తెరాస రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటునటువంటి తప్పులు నిర్ణయాలు తప్పులు ప్రకటనల వల్ల ఈ రోజు నిరూధ్యోగ యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారని గత రోజూ శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడి అకాల మరణం చెందిన కెయూ విధ్యార్థి సునీల్ నాయక్ మరణం ప్రభుత్వం హత్యగానే మేము భావిస్తున్నామని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఎస్టీ బిడ్డ అలనాటి తెలంగాణ ఉధ్యమకారుడు తెలంగాణ ఉధ్యమ సమయంలో ప్రత్యేక్షంగా తెరాస పార్టీలోనే ప్రత్యేక పాత్ర పోషించి అలుపెరగని పోరాటం చేసిన యువ విధ్యార్థి నాయకుడు బధావత్ సారయ్య నాయక్ మనస్తాపంతో తెరాస ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజనులందరూ ముఖ్తకంటంతో అలుపెరగని పోరాటం చేసిన యావత్ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తే మన నీళ్ళు మన నిధులు మన నియిమకాలు మనకే వస్తాయని కొండంత ఆశతో కోటి కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2014 ఎన్నికల్లో విజయం సాదించి ఆధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలంతా తమ కోసమే వెలిసిన పార్టీ అని తన బాగోగులు తెలిసిన పార్టీ అని నాయకులని తనకు ఉధ్యోగాలు వచ్చినట్టేనని రాష్ట్రం సుబిక్షంగా మారబోతుందని రొమ్ము విసిరి ముందుకు వచ్చిన తెలంగాణ యువత నోట్లో గత ఏడేళ్ళుగా మన్ను (మట్టి) కొడుతున్నారని తెలిసిపోయాక ఎటు వెళ్ళే దారి లేక తమ బాధ చెప్పుకుందామన్న వినే వారూ లేక తెలంగాణ యువత ఆత్మహత్యలకు పాల్పడుతూ నేల రాలుతుంటే మన కుటుంబమే మనల్ని పీడిస్తూ చంపుకు తింటుంటే ఆకలి చావు తప్పా తెలంగాణలో ఏముందని మా తోటి మిత్రుడు సునీల్ నాయక్ లాంటి వారు ఆత్మహత్యలతో నేల కొరుగుతుంటే ఈ సమాజం మన రాష్ట్రం ఏమైపోతుందోనని భయంగా ఉందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. దయచేసి తెలంగాణ యువత ఎవరూ కూడ ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాబా సాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ ద్వారా మనకు కల్పించిన ఇచ్చిన ఓటు హక్కును ఆయుధంగా మార్చుకుని మనకు అణువైన నాయకులను ఎన్నుకుని ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని రాబోవు రోజుల్లో తెరాస ప్రభుత్వం కుప్పకూలడం కాయమని ఎంతో దూరంలో లేదని ఇకనైన తెలంగాణ యువత ఆలోచించి అనువైన నిర్ణయాలు తీసుకుని నాయకులకు బుద్ది చెప్పాలని బధావత్ సారయ్య నాయక్ తెలంగాణ యువతకు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment