Followers

వంట గ్యాస్ లీకేజీ తో అగ్ని ప్రమాదం..

 వంట గ్యాస్ లీకేజీ తో  అగ్ని ప్రమాదం..

ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

 వంట గ్యాస్ లీకేజీతో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన  ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామం సమీపంలోని తుర్కశీ వాడలో జరిగింది . ఈ సంఘటనలో రెండు గుడిసెలు  పూర్తిగా దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే  షేక్ బిబి భర్త మౌలానా. సయ్యద్ అంకుష్ తండ్రి కమల్ రెండు ఇళ్లు పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని పలువురు పేర్కొన్నారు. షేక్ బేబీ కి సంబంధించిన ఇంటిలో 70 వేల రూపాయలు అర్ధ తులం బంగారం రెండు కింటల్ల బియ్యం బట్టలు ఇంటిసామాగ్రి మొత్తం కాలిపోవడం వలన కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు .సయ్యద్ అంకుష్ ఇంటికి సంబంధించి లక్షా 20వేల నగదు రూపాయలు బట్టలు వంట సామాన్లు క్వింటా బియ్యం మొత్తం కాలిపోయాయని వీరికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని సర్పంచ్ కదిరే రజిత శ్రీనివాస్ , వైస్ ఎంపీపీ  ప్రభుత్వాన్ని కోరారు. తక్షణ సహాయం కింద సర్పంచ్  వెంటనే 30 కిలోల బియ్యం వెయ్యి రూపాయలు నగదును అందించారు .నిత్యవసర సరుకులు రెండు కుటుంబాలకు మాజీ ఎంపిటిసి కొలనూరు శంకర్ వెయ్యి రూపాయలు నగదు సహాయం ఉప సర్పంచ్ హనుమంతు ఐదు వందలు, చెటుకూరి రాజు 50 కిలోల బియ్యం అందించారు. ప్రభు కుమార్ ఇరవై ఐదు కిలోల బియ్యం ఇచ్చారు ఎవరైనా దాతలు సహాయం చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...