స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానము కాణిపాకం
కాణిపాకం, పెన్ పవర్
శ్రీ స్వామి వారి దేవస్థానం ఆలయ ప్రాంగణములో గల శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయము నందు వేంచేసిన శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహమునకు ప్రధాన ఆలయం నందు గల కళ్యాణ వేదిక నందు శ్రీ రామనవమి సందర్భంగా సీతారాముల స్వామి వారికి స్నపన తిరుమంజన సేవ మరియు కల్యాణోత్సవం నిర్వహించడం జరిగినది. ఈ కల్యాణోత్సవాలకు పట్టు వస్త్రాలు, మంగళ సూత్రం, ముత్యాల తలంబ్రాలు, సమర్పించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో విద్యా సాగర్ రెడ్డి, పర్యవేక్షకుడు కోదండపాణి, కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment