Followers

రాపాక బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

రాపాక బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామం లో దళిత జన ఆశాజ్యోతి దివంగత భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జీవన్ యూత్ ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాపాక  బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ యొక్క కీర్తిని కొనియాడారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని, ఇలాంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని యువత విధ్యా రంగంలో అభివృద్ధి చెంది దళితుల యొక్క అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. అదే విధంగా స్టూడెంట్స్ తరపున గడ్డం వినోద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ట్యూషన్ పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, పరీక్ష అట్టలు, సర్పంచ్ రాపాక రాజేశ్వరి, ఉప సర్పంచ్ మద్దిపాటి రామారావు  అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మద్దిపాటి ప్రకాష్ రావు, మద్దుకూరి విష్ణు రావు, మద్దుకూరి శ్రీనివాస్, యూత్ తరపున పరిటాల సతీష్, గడ్డం జగజ్జీవన్ రావు, రాజ్ కుమార్, సురేష్ పాల్గొనడం జరిగింది .

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...