Followers

తొమ్మిది మంది సాయుధ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించిన...జిల్లా ఇంచార్జ్ ఎస్పి ఎం. రాజేష్ చంద్ర

 తొమ్మిది మంది సాయుధ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించిన... జిల్లా ఇంచార్జ్ ఎస్పి ఎం. రాజేష్ చంద్ర

ఆదిలాబాద్ , పెన్ పవర్ 

క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి మరింత బాధ్యతతో సమర్థ వంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఇంచార్జ్ ఎస్పీ ఎం రాజేష్ చంద్ర పదోన్నతులు పొందిన కానిస్టేబుళ్లకు సూచించారు. పదోన్నతుల దస్త్రాన్ని సత్వరమే పరిశీలించి, సకాలంలో పదోన్నతులు కల్పించినందుకు జిల్లా ఇన్చార్జి ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేసిన పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు,ఇటీవలే అదిలాబాద్ జిల్లా పూర్తి ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన ఎం.రాజేష్ చంద్ర పోలీస్ కార్యాలయంలో ముఖ్యమైన పదోన్నతి దస్త్రంపై దృష్టిసారించారు.ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ పదోన్నతికి అర్హులైన తొమ్మిది మందిని సీనియార్టీ ప్రకారం ఎంపిక చేసి వెంటనే పదోన్నతి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం పదోన్నతి పొందిన తొమ్మిది మంది సాయుధ కానిస్టేబుళ్లను ఆహ్వానించి హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి చిహ్నంను అలంకరించారు. పదోన్నతి పొందిన వారిలో ఏఅర్ కానిస్టేబుళ్లు 2007 బ్యాచ్ కు చెందిన

1) పి. సంజీవరెడ్డి,

2) మహమ్మద్ అక్బర్,

3) కే. సర్దార్ సింగ్,

4) కె. భగవాండ్లు,

5) ఎస్. రాజేశ్వర్ రెడ్డి,

6) కే. అనురత్,

7) కె. మేఘాశ్యామ్,

8) ఎం. రామ్ గోపాల్,

9) టి. మల్లేష్, లు ఉన్నారు.

ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన వారినుద్దేశించి జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహించిన వారికి తప్పకుండా గుర్తింపు వస్తుందని తెలిపారు. పదోన్నతులు పొందినవారు తమ విధుల పట్ల మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు.త్వరలో ఉమ్మడి జిల్లాలో ఖాళీలనుసారంగా బదిలీ ఉత్తర్వులు వెల్లడిస్తామని తెలిపారు.ప్రతి నెల ఏర్పడిన ఖాళీలను పదోన్నతులు కల్పించి వెనువెంటనే భర్తీ చేస్తామని తెలిపారు. త్వరలో మరిన్ని విభాగాల్లో పదోన్నతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గడికొప్పుల వేణు, ఎస్పి సిసి దుర్గం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ, ప్రతినిధులు కె. అడెల్లు, చిందం, దేవిదాస్, సి ఆర్ గంగారాం, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...