రాత్రి కర్ఫ్యూ కు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
రాత్రి 9గంటలనుండి తెల్లవారుజాము 5గంటల వరకు ప్రజలు రోడ్లమీదికి రాకూడదు.
వ్యాపార, వాణిజ్య సంస్థలు,మరియు ప్రజలు సహకరించాలి.
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
నెల్లికుదురు ఎంఆర్వో ఆనంతుల రమేష్.
నెల్లికుదురు, పెన్ పవర్రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజాము ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కు ప్రతి ఒక్కరు సహకరించి, ఇంట్లోనే ఉండి కరోనా నివారణకు కృషి చేయాలని, మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండల తహసీల్దార్ ఆనంతుల రమేష్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... కరోనా వైరస్ రెండవసారి ఉదృతం అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారు సహకరించి, కరోనా నివారణకు సహకరించాలన్నారు.రాత్రి తొమ్మిది గంటల నుండి తెల్లవారు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించడం జరిగిందన్నారు. రాత్రి 9 తర్వాత ప్రజలు రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ కర్ఫ్యూ కు సహకరించి, ఇంట్లోనే ఉండాలన్నారు. అత్యవసర సమయంలో బయటకు రావాల్సి వస్తే తప్పకుండా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. గుంపులు గుంపులుగా ఉండకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ... ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, కరోనా నివారణకు సహకరించాలన్నారు. ఈ కర్ఫ్యూ ఏప్రిల్ 20నుండి మే 1వ తారీఖు వరకు అమల్లో ఉంటుందని అన్నారు.
No comments:
Post a Comment