ఘనంగా ది చెన్నై సిల్క్స్ అధినేత షష్ఠి పూర్తి వేడుకలు.
కూకట్ పల్లి, పెన్ పవర్
ప్రముఖ వస్త్ర, బంగారు నగల విక్రేత ది చెన్నై సిల్క్స్ మరియు శ్రీ కుమారన్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.కే ఆర్ముగం దంపతుల షష్ఠి పూర్తిని పురస్కరించుకుని సోమవారం కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న షోరూమ్ వద్ద సిబ్బంది ఆధ్వర్యంలో సేవా కార్యక్రమలు నిర్వహించారు. కరోనా వైరస్ ఉదృతంగా విస్తరిస్తున్న వేళ వైజంక్షన్ ట్రాఫిక్ కూడలి వద్ద మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వారికి అవగాహన కల్పిస్తూ మాస్క్ లు అందజేశారు. ఈ సందర్భంగా ది చెన్నై సిల్క్స్ వై జంక్షన్ ఎ.జి.ఎం రమేష్ మాట్లాడుతూ తమ సంస్థ ఎం.డి పి.కే ఆర్ముగం దంపతుల షష్టి పూర్తి సందర్భంగా వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, రోడ్లపై నివసిస్తున్న పేదలకు, నిర్భాగ్యులకు ది చెన్నై సిల్క్స్, శ్రీ కుమారన్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తరుపున అన్నదానం కార్యక్రమాలు తో పాటు వారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే పచ్చదనం పెంపొందించేందుకు తమ షోరూమ్ కు విచ్చేసిన కొనుగోలుదారులకు మొక్కలను అందజేశారు. కొనుగోలు దారుల రక్షణను దృష్టి లో పెట్టుకొని షాపింగ్ మాల్ లో క్రమంతప్పకుండా సానిటైజేషన్ చేస్తున్నామని, కస్టమర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమకు కావాల్సిన దుస్తులు కొనుగోలు చేయవచ్చు అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మేనేజర్లు శరవణన్ , జోసెఫ్, వినయ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment