Followers

కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడం సరికాదు

 కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడం సరికాదు.

కూల్చిన స్థలంలోనే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.



తొర్రూరు, పెన్ పవర్

ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తాము నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చివేయడం భావ్యం కాదని, నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని 304 సర్వే నెంబర్ లో నిర్మించిన ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ, గురువారం బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన తమకు న్యాయం చేయాలని, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, మునిసిపల్ కమిషనర్ గుండె బాబులకు వినతి పత్రం సమర్పించారు.కూలి పని చేసుకొని, పొట్ట పోసుకునే తమకు గూడు లేకుండా చేయొద్దని, వేడుకున్నారు.  నిర్మించిన ఇళ్లకు గాను గత కొంత కాలంగా పురపాలికకు ఇంటి పనులు చెల్లిస్తున్నామని, తెలిపారు. ఒక పక్క పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తూ.. మరోపక్క పేదలు తమ రక్తం, చెమటతో నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వమే కూల్చివేయడం సమంజసం కాదన్నారు. ఇల్లు తప్ప ఎలాంటి స్థిరాస్తులు లేని, తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం అందించిన వారిలో బాధితులు మహంకాళి దేవేందర్,మంగళపల్లి యాకస్వామి, వేల్పుల మమత, మంగళపల్లి లక్ష్మీ, ఆకారపు కృష్ణ , ఇందుమతి, సోమయ్య, వెంకటయ్య, అన్నపూర్ణ, స్వరూప తో పాటు పలువురు బాధితులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...