హాస్పిటల్ ను ప్రారంభించిన.. మంత్రి ఈటెల రాజేందర్
పెన్ పవర్, కాప్రాకాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన హెల్త్ అడ్డా హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరై జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి, ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ఏ.ఎన్.వి కోటేశ్వరరావు, పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ హెల్త్ అడ్డా హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ కోటేశ్వరరావు వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, అలాగే అలు టీవీ కార్యమాల్లో పాల్గొంటూ ప్రజలకు తన అమూల్యమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారని, వైద్య వృత్తిలో ఆయనకు అపార అనుభవం ఉందని కొనియాడారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు తక్కువ ధరలో అందించి దినధినాభివృద్ది చెంది అందరి అభిమానం పొందాలని ఆకాంక్షించారు. ఈసందర్భంగా హెల్త్ అడ్డా హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ఏ.ఎన్.వి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈసీఐఎల్ తదితర పరిసర ప్రాంతాల ప్రజలకు సామాన్య ధరలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు హాస్పిటల్ ప్రారంభించామన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, అలాగే మా హాస్పిటల్ లో కోవిడ్ చికిత్సతో పాటు 20 రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. 25 సంవత్సరాల అపార అనుభవం గల వైద్యుల బృందం 24 గంటలు అందుబాటులో ఉంటారని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, స్వర్ణరాజ్ శివమణి, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, ధన్ పాల్ రెడ్డి కాసం మహిపాల్ రెడ్డి మణిపాల్ రెడ్డి.మురళి పంతులు , బేతాళ బాల రాజు, గరిక సుధాకర్, నాగిళ్ల బాల్రెడ్డి, సుడుగు మహేందర్రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కుమారస్వామి, జై కృష్ణ, సంపత్ మరియు ఆస్పత్రి సిబ్బంది టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment