కరోనా వల్ల జాతర్లు రద్దు చేయాలని కలక్టర్ కు గిరిజనులు వినతి
అయ్యా జిల్లా కలెక్టర్ వారి దివ్య సముఖమునకు ఇట్లు విశాఖ ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ గిరిజనలు వ్రాసుకున్న విన్నపములు.
అయ్యా. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభించి విలయతాండవం చేస్తుంది.జిల్లాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుంది. మా ప్రాంతంలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. భయాందోళనలో బ్రతుకును వెళ్లదీస్తున్నా ము. పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా తాకింది. పాఠశాలలకు ప్రభుత్వం వారు సెలవులు ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నాము. ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరించి సామాజిక దూరం పాటించాలని ఆరోగ్యశాఖ వారు చెబుతున్నారు. మా ప్రాంత ప్రజలు ఎక్కువ గా నిరక్షరాస్యులు కావడంతో అవి అంతంత మాత్రంగానే పాటిస్తున్నారు. ఈ తరుణంలో గిరిజనుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ తల్లి, చింతపల్లి ముత్యాలమ్మ తల్లి జాతరలు భారీ యెత్తున జరుపుటకు మా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు, ఉత్సవ కమిటీలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రెండు పండుగలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కిక్కిరిసిన జనంతో రద్దీగా వినోద కార్యక్రమాలు, బాణాసంచా, సర్కస్, జాయింట్ వీల్, వంటివి జాతరలో విరివిగా ఉంటాయి. వచ్చిన భక్తులు సామాజిక దూరం పాటించడం, మాస్క్ లను ధరించ డం సాధ్యం కాదు. ఊరి మొత్తం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయడం సాధ్యం కాదు. జాతరలో కరోనా అనే అంటు వ్యాథి మాకు అంటు కుంటే ఒక్కరోజు వ్యవధిలోనే వేలల్లో కేసులు నమోదు అయి మరణ మృదంగం మోగడం మొదలవుతుంది. కరోనా సోకిన వారికి గిరిజన ప్రాంతం ఆసుపత్రులలో వైద్య సిబ్బంది మరియు సరైన వైద్య సౌకర్యాలు లేక విశాఖ కె.జి.హెచ్ కు మరియు విమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు అక్కడ కన్నవారు చూడలేక ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో తెలియక ఆ కుటుంబాలు నరకం చూస్తున్నాయి. మా ఆరాధ్య దైవాలు మోద కొండమ్మ తల్లి, ముత్యాల మ్మతల్లు చల్లని దీవెనలు తొ ప్రశాంతంగా ఉన్నా మా ప్రాంతం మా ఉత్సవ కమిటీలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల అనాలోచితమైన నిర్ణయాలతొ జాతరలు జరిపితే గిరిజన ప్రాంతం కరోన బారినపడి సవాల దిబ్బగా మారే ప్రమాదం ఉంది. దయచేసి కరోనా అనే అంటు వ్యాధి పొంచి ఉన్న పెను ముప్పు కారణంగా మా ప్రాంతంలో జరిగే జాతరకులకు గిరిజన ప్రజా రోగ్య దృష్ట్యా అనుమతులును వెంటనే రద్దు చేసి మన్య ప్రాంత ప్రజలకు కరోనా అంటు వ్యాధి ప్రబల కుండా చూడాలని కోరుతూ పాడేరు ఏజెన్సీ ప్రాంత ప్రజలు,గిరిజన సంఘాలు కోరారు.
No comments:
Post a Comment