Followers

కేంద్రం వదిలేసినా రాష్ట్రం ఉంది మనకు అండగా

కేంద్రం వదిలేసినా  రాష్ట్రం ఉంది మనకు అండగా 

 పెన్ పవర్,ఆత్రేయపురం

పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఏదైనా కారణంతో మరణిస్తే బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుందని కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఏపీ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ శ్రీ చిర్ల జగ్గిరెడ్డి  అన్నారు. దీనికోసం వైఎస్పార్‌ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగిస్తుందనీ,  అర్హులైన వారందరికీ  బీమా వర్తింపజేస్తామనీ అన్నారు.  అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పరిహారం అందని 42 మందికి నియోజకవర్గం లో కొత్తపేట మండలంలో 12 మంది కి 24 లక్షల రూపాయలు, ఆత్రేయపురం మండలం లో ఏడుగురికి 14 లక్షల రూపాయలు, ఆలమూరు మండలంలో తొమ్మిది మందికి 18 లక్షల రూపాయలు, రావులపాలెం మండలంలో 14మందికి 40 లక్షల రూపాయలు   వైఎస్సార్‌ బీమా నిధులను నామినీదారులకు  చెల్లించారు. 

బీమా పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రతి పాలసీకి పీఎంజేజేబీవై, ప్రధాన మంత్రి సురక్షా యోజన కింద కేంద్ర ప్రభుత్వం 50శాతం ప్రీమియం చెల్లించేది. 2020 మార్చి 31 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించడం ఆపేసింది. 2020 మార్చి నుంచి పథకాన్ని నిలిపివేస్తామనీ,ఇష్టమైతే రాష్ట్రాలు కొనసాగించుకోవచ్చని తెలిపింది. కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియాన్ని చెల్లిస్తోందని అన్నారు. గత ఏడాది అక్టోబరు 21న బ్యాంకులకు ప్రీమియం రూపంలో రూ. 510 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం  చెల్లించి, బాధిత కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు.అనంతరం ఆత్రేయపురం గ్రామంలో వృద్దుల విశ్రాంతి భవనం  రైతు బజార్ ఏర్పాటు కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో  ఆత్రేయపురం మాజీ ఎంపీపీ పీఎస్ రాజు, గ్రామ పెద్దలు ముదునూరి రామరాజు,  ఎంపీడీఒ నాతి బుజ్జి,  వాడపల్లి దేవస్థానం కమిటీ మెంబర్ సురేష్ రాజు,వసంతవాడ సర్పంచి గాదిరాజు, ఎస్సైనరేష్, డీటీ మాధురి,పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్,చిలువూరి చిన వెంకట్రాజు, చిలువూరి రామకృష్ణంరాజు,బోనం సాయిబాబా, కప్పల శ్రీధర్, గోపాలరాజు, గోపీరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...