రాళ్ల వర్షం పడకుండా కాపాడండి స్వామి...
శ్రీ అంజనేయస్వామి కి ముడుపుకట్టిన రైతులు
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్రాళ్ల వర్షం పడకుండా చేతికచ్చిన పంటపోలాలను కాపాడండి స్వామి అంటూ ఎల్లారెడ్డిపేట గ్రామ రైతులు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం గ్రామ పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ ఆద్వర్యంలో ముడుపు కట్టారు. పురాతన కాలం నుండి ప్రతి ఏటా రాళ్ల వర్షం కురువకుండా శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ముడుపు కడుతున్నామని ఆ భగవంతుడు కూడా రాళ్ళవర్షం బారీ నుంచి పంటలను కాపాడుతున్నారని గ్రామ పురోహితులు దయానంద్ శర్మ తెలిపారు. పిల్లాపాపలను. పాడి పంటలను చల్లంగా చూడాలని కోరుతూ రైతులు మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు చర్చామండలి అద్యక్షులు మద్దుల పద్మా రెడ్డి నేవూరి నర్సింహారెడ్డి. గుండాడి వెంకట్ రెడ్డి .పత్యేకపూజలు చేశారు రైతులు గన్న బాల్ రెడ్డి మద్దుల బాల్ రెడ్డి. సురేందర్ రెడ్డి . పారిపెళ్ళి సంజీవరెడ్డి మద్దుల నారాయణ రెడ్డి. సద్ది లక్ష్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. సాదు మల్లారెడ్డి. మద్దుల చంద్రారెడ్డి. చకీలం నారాయణ గుప్తా. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment