సిఎస్సార్-సిడి ఏజిఎం కు వినతి పత్రం
మల్కాపూర్ గ్రామ అభివృద్ధి కమిటి అధ్యక్షులు ఎండి రహీం
రామగుండం, పెన్ పవర్
ఎన్టీపీసీ భూ నిర్వాసిత మరియు ప్రభావిత గ్రామము ఎన్టీపీసీ తో పాటు అనేక సంస్థల అభివృద్ధి కోసం మా గ్రామానికి చెందిన భూములు ఇచ్చామని రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న కూడా ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని ప్రాంతం మాది. మా ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలు అవి ఏమిటంటే మల్కాపుర్ తో పాటు అనేక గ్రామాలకు ప్రధాన రహదారి అయిన శ్రీనగర్ కాలనీ రోడ్డులో నిత్యం వందలాది పోలీస్ మరియు సిఐఎస్ఎఫ్ వాహనాలతో రద్దీగా మారడంతో వాహనదారులు ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారని కావున ఇట్టి రోడ్డు రాజీవ్ రహదారి నుండి ఓసిపి-4 రోడ్డు వరకు 80 ఫీట్స్ వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా మా మల్కాపూర్ లో వ్యవసాయం మీద ఆధారపడే రైతులకు ఆకు కూరలు కూరగాయల విత్తనాలు పంపిణీ చేయాలి. మల్కాపుర్ రామయ్యపల్లి, సాయిరాం కాలనీ, శ్రీనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి మరియు సీసీ రోడ్లు వేసి సోలార్ లైట్స్ మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మల్కాపుర్ చెరువు (బ్రాహ్మణ కుంట) కట్టకి ఇరువైపులా రాతి గోడ నిర్మించి రోడ్డు వేయాలి. మల్కాపుర్ హానుమాన్ దేవాలయం నుండి ఎన్టీపీసీ పున:రావాస కాలనీ వరకు సీసీ రోడ్డు మరియు పావని కాలేజి నుండి పున:రావాస కాలనీ వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. మా ఊరి మహిళా సమైఖ్య భవనంలో కుర్చీలు టేబుల్స్ బీరువా ఫ్యాన్లు సౌకార్యాలను సమకూర్చాలి. మూతబడిన ప్రభుత్వ పాఠశాల స్థలంలో జిమ్ మరియు మహిళలకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న మా ప్రాంత ప్రజల యందు మీరు దయతలచి తమ ఎన్టీపీసీ- సీఎస్సార్-సిడి నిధుల ద్వారా పైన తెలిపిన ప్రజా ప్రయోజనాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎన్టీపిసి సిఎస్సార్-సిడి సిజిఎం కి మల్కాపూర్ గ్రామ అభివృద్ధి కమిటి అధ్యక్షులు ఎండి రహీం వినతి పత్రం పంపించారు.
No comments:
Post a Comment