ప్రయాణికుల ఆరోగ్య భద్రత ముఖ్యం
రాజమహేంద్రవరం,పెన్ పవర్
సెకండ్ వేవ్ కరోనా ఉదృతి నేపథ్యంలో నగరంలోని ప్రధాన బస్ కాంప్లెక్స్ ను రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఆర్టీసీ డిఎం ను అడిగి తెలుసుకున్నారు. కాంప్లెక్స్ లో వివిధ విక్రయ శాలలను పరిశీలించారు. ప్రయాణికులతో ముచ్చటించారు.ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ తీయవద్దని, కూడా శానిటైజర్ తీసుకువెళ్ళి ప్రతి పది పదిహేను నిమిషాలకు చేతులు శుభ్రం చేసుకోవాలంటు పలు జాగ్రత్తలు సూచించారు. అలాగే బస్సులో ప్రయాణికులతో కూడా ఆయన ముచ్చటించారు. అనంతరం మీడియాతో ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రోజుకు 30 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు.ఎంతో సుదూర ప్రాంతాలకు వచ్చి పోయే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ లోతప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు.ఇప్పటికీ కాంప్లెక్స్ లో రెండు శానిటైజర్ స్టాండ్స్ వినియోగిస్తున్నారని, వీటితో పాటు ఆర్టీపీసీఆర్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. కాంప్లెక్స్ ప్రాంగణాన్ని హైపో క్లోరైడ్ తో కాకుండా ఫిమ్గేషన్ చేస్తే ఫలితం ఉంటుందని, ఆ మేరకు డిఎంకు సూచించినట్టు తెలిపారు. కాంప్లెక్స్ లో ఆర్టీపీసీఆర్ కౌంటర్, టెంపరేచర్ చెకింగ్ స్ర్కీన్ ఏర్పాటుకు వైద్య శాఖాధికారులతో మాట్లాడతానని చెప్పారు.
రాష్ట్రంలో వివిధ వాణిజ్య, వ్యాపారాలకు ప్రధానమైన రాజమహేంద్రవరం నగరంలో రైల్వే, బస్సు స్టేషన్, విమానాశ్రయం వద్ద కచ్చితంగా ఆర్టీపీసీఆర్ కౌంటర్స్ ఏర్పాటు చాలా అవసరమని, ఈ విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళతానని తెలిపారు. కార్యక్రమంలో పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కాను బోయిన సాగర్, వైసిపి నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్, జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ అన్నపూర్ణ రాజు, నాయకులు బిల్డర్ చిన్న, గణేష్ బాబు, ఆర్టీసీ ఆర్ఎం ఆర్ వి ఎస్ నాగేశ్వరరావు,డిఎం మూర్తి డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment