ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పార్టీలో చేరికలు - పన్నాల దేవేందర్ రెడ్డి
తార్నాక , పెన్ పవర్
మల్లాపూర్ డివిజన్ లోని బ్యాంక్ కాలనీ ప్రధాన కార్యదర్శి మరియు మల్లాపూర్ యాదవ్ సంఘం ప్రధాన కార్యదర్శి రవి యాదవ్ , బ్యాంక్ కాలనీ సంయుక్త కార్యదర్శి శివ శంకర్ స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సమక్షంలో తెరాస లో చేరారు. ఈ సందర్బంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ తోనే సాధ్యం అని అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పార్టీ లో చేరుతున్నారు అని ఆయన తెలిపారు. పేదల పక్షపాతి సిఎం కెసిఆర్ అని, ప్రభుత్వం పేద ప్రజల కోసం ఆరు సంవత్సరాల్లో దాదాపు ఐదు వందలకు పైగా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని అని తెలిపారు. గత అరవై సంవత్సరాలు గా లేని అభివృద్ధి ఆరు సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment