బావిలోకి దూకి వివాహిత ఆత్మహత్య
నెల్లికుదురు, పెన్ పవర్
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం కాశ్య తండాలో విషాదం నెలకొంది తల్లి మందలించిందని బాణోత్ కావేరి (17) మైనర్ బాలిక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కావేరి కి గత సంవత్సరం మైనార్టీ తీరకముందే తల్లిదండ్రులు పెండ్లి చేశారని ,అనివార్య కారణాల వలన పెండ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత విడాకులు తీసుకున్నారు.అప్పటి నుండి తల్లిదండ్రులు వద్ద నే కావేరి ఉంటుంది.గత కొన్ని రోజులుగా తల్లికి కావేరి గొడవలు జరుగుతున్నాయని,తల్లి పోరును తట్టుకోలేక కావేరి రెండు మూడు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని రాత్రి సమయంలో తల్లికి కావేరి కి తీవ్రంగా గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన కావేరి మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో తండా సమీపంలో ని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.స్థానికులు గాలింపు చేపట్టాగా వ్యవసాయ బావి సమీపంలో చెప్పులను గమనించి స్థానిక పోలీసుల కు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై జితేందర్ బావిలో ఉన్న కావేరి మృతదేహాన్నీ స్థానికుల సహాయం తో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు నెల్లికుదురు ఎస్ఐ .కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment