Followers

కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరిస్తూ ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించండి

  కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరిస్తూ  ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించండి 

చిత్తూరు,  పెన్ పవర్

 మే 5 నుండి 23 వరకు 133 పరీక్షా కేంద్రాల లో జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మీడియెట్ పరీక్షలకు నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు  జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండవ సంవత్సర మరియు వొకేషనల్ కోర్సు పరీక్షలకు హాజరు కానున్న 1,18,303 మంది విద్యార్థులు.కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరిస్తూ ఇంటర్ మీడియెట్ పరీక్షలను పకద్భందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి  ఎం.ఎస్. మురళి ఇంటర్ మీడియెట్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో సమావేశపు మందిరం లో మే 5 నుండి 23 వరకు ఉ. 9 గం.ల నుండి మ. 12 గం.ల వరకు జరిగే ఇంటర్ మీడియెట్ పరీక్షల నిర్వహణ పై పోలీసు, ఆర్టిసి, పోస్టల్ డిపార్ట్మెంట్, మెడికల్, విద్య, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండవ సంవత్సర మరియు వొకేషనల్ కోర్సు పరీక్షలకు 1,18,303 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందులో మొదటి సంవత్సరం 48,731 మంది విద్యార్థులు కాగా, రెండవ సంవత్సరం 69,572 మంది, 133 కేంద్రాలలో పరీక్షల నిర్వహణ జరగనున్నదని, ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ లో కేసులు విజృంబిస్తున్న తరుణంలో ఖచ్చితంగా కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి పరీక్షల నిర్వహణ జరగాలని సూచించారు. 

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్ మీడియెట్ అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఒక రూములో పరిమిత సంఖ్యలో పరీక్షల నిర్వహణ జరగాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించడంతో పాటు స్యానిటైజర్ ను అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలీసు శాఖ వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఇన్విజిలేటర్ల జాబితాను విద్యా శాఖ వారు పంపాలని, పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కొ అధికారులను, పరీక్షల నిర్వహణకు 5 ఫ్త్లెయింగ్ స్క్వాడ్ బృందాలని విద్యా శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులతో కలసి ఏర్పాటు చేయాలని, పరీక్షలు జరుగు రోజున పరీక్ష నిర్వహించే సమయంలో 144 సెక్షన్ అమలు, పరీక్షల కేంద్రాల సమీపంలో గల జిరాక్స్, కంప్యూటర్ సెంటర్లను మూసి వేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీటి వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు.  ఇంటర్ మీడియెట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని డిస్ట్రిక్ట్ ఎగ్జామిన్షన్ కమిటీ వి. శ్రీనివాసులు రెడ్డి డిఆర్ఓ కు వివరించారు. ఈ సమీక్షా సమావేశం లో డిఇసి మెంబర్లు డి. గోపాల్ రెడ్డి, మురళి కృష్ణ, హెచ్ పి సి మెంబర్ వై. వెంకట్ రెడ్డి, డిఎం ఆర్టిసి కిరణ్ కుమార్, ట్రాన్స్ కొ ఇ ఇ అన్వర్ బాబు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...