ధరిత్రీ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన ఆరోగ్య హక్కు వేదిక సభ్యులు
పెన్ పవర్, మందమర్రిధరిత్రీ దినోత్సవం సందర్భంగా గురువారం రామకృష్ణాపూర్ లో ఆరోగ్యహక్కు వేదిక నాయకులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతె మాట్లాడారు.నేడు గాలి, నీరు, నేల కాలుష్యానికి గురవుతున్నారు. తద్వారా అవి వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయన్నారు. దీనితో జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ కాలుష్యం తో జీవరాశులతో పాటు మానవ ఆరోగ్యం ప్రమాదంలో పడిందన్నారు. కాలుష్య భూతాన్ని అరికట్టాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మొక్కలు నాటి రక్షించడం, వర్ష, వ్యర్ధ నీటిని ఒడిసి పట్టుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, రసాయన, ఎరువులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడం, వన్యప్రాణుల ను కాపాడుకోవడం, జీవ విచిన్న ఉత్పత్తులను వాడడం, పిల్లలకు పర్యావరణ పట్ల అవగాహన కల్పించడం, ఎలక్ట్రిక్ వాహనాల ను వినియోగించండం లాంటి అంశాలను చేపట్టాలని అన్నారు. ఈ డిజిటల్ యుగంలో మానవుడు తీసుకొనే అనాలోచిత నిర్ణయాలతో మనం పీల్చే గాలి, నీరు , నేల కాలుష్య కోరల్లో చిక్కుకొని, ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే కరోనా లాంటి మహమ్మారి లు జనించే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పోతుల మురళి కృష్ణ, పట్టణ కార్యదర్శి వేల్పుల మహేందర్, ఉపాధక్షుడు వెంకట స్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు నందిపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment