Followers

కోవిడ్, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి జిల్లాకు ఒక సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి నియామకం

 కోవిడ్, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి జిల్లాకు ఒక సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి నియామకం





💐 పాజిటివ్ కేసులు వచ్చిన వారిని తీసుకొని వెళ్లడానికి 104 మరియు 1902 కాల్ సెంటర్ల ఏర్పాటు
💐 చిత్తూరు జిల్లాలో భారీగా కేసులు పెరుగుతున్నాయి
💐 పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి
💐 కోవిడ్ కేర్ సెంటర్లు ఆసుపత్రుల సామర్ధ్యం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది
💐 హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి
💐 విపత్కర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యాక్సిన్ ను ఎట్టి పరిస్థితిలోనూ వృదా చేయకండి : ముఖ్యమంత్రి




 
చిత్తూరు, పెన్ పవర్ 
దేశంలో గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపద్యంలో రాష్ట్రంలో కూడా బారీగా కేసులు పెరుగుతున్నాయని అందులో చిత్తూరులో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని జిల్లా అధికారులతో పాటు అందరూ తగిన జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కోవిడ్ పరిస్థితులు మరియు వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని జిల్లాలో పాజిటివిటి శాతం 11.9 గా నమోదైందని, దీనికి సంబందించి జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలని అవసరమైన వారిని కోవిడ్ కేర్ సెంటర్ కు పంపి చికిత్స లు చేయించాలన్నారు. జిల్లాలో పట్టణ ప్రాంతాలలో 60 శాతం, గ్రామీణ ప్రాంతాలలో 40 శాతం కేసులు నమోదవుతున్నాయని అయితే సరైన అవగాహన లేక పోవడంతో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది మరణిస్తున్నారన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఎ.ఎన్ ఏం లు సర్వే నిర్వహిస్తున్నారని ఈ సర్వే లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని ఆరోగ్య కేంద్రాలకు పంపి పరీక్షలు కూడా నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ లతో పాటు జిల్లాకు ఒక సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారిని నియమిస్తున్నామని వీరితో పాటు జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కోవిడ్ కు సంబందించి రోజు మానిటరింగ్ చేయాలన్నారు. జిల్లాలో గతంలో లాగానే ఆసుపత్రులలో వైధ్య సేవలు పెంచి కోవిడ్ బాధితులకు చికిత్సలు అందించాలని ఆయన అన్నారు. అన్ని కోవిడ్ ఆసుపత్రులను సి.సి. టి వి ల ద్వారా మానిటరింగ్ చేయాలని ఇందు కోసం 24 గంటలు అందు బాటులో ఉండేలా హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేయాలని వీటి ద్వారా ప్యారా మెడికల్ స్టాఫ్ డాక్టర్లు మరియు మందులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన అన్నారు. 104 కాల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు బాధితులను మానిటరింగ్ చేయాలని ఈ కాల్ సెంటర్ పని తీరును జె.సి లు, కలెక్టర్లు రోజుకు ఒక సారి పరిశీలించాలని ముఖ్యమంత్రి అన్నారు. అందరూ కలెక్టర్లు కోవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బాధితుల మరణాలు జరగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.  ఎవ్యాక్సినేషన్ కార్యక్రమం బారీ ఎత్తున జరుగుతున్నదని, దేశంలో మొత్తం ఒక రోజు మొత్తం 35 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా అందులో మనం 6 లక్షల మందికి ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి అన్నారు. వారం రోజు లోపల ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ వ్యాక్సినేషన్ చేయించుకొని ఉండలాని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితిలలో వ్యాక్సిన్ వృధా చేయకూడదని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లా స్థాయిలో కోవిడ్ తో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను టాస్క్ ఫోర్స్ టీం లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో చిత్తూరు నుంచి జె.సి అభివృద్ది వి.వీరబ్రహ్మo, డి.ఏం అండ్ హెచ్ ఓ డా.పెంచలయ్య, డి.సి.హెచ్.ఎస్.డా సరళమ్మ, ఎ.ఎస్.పి.మహేష్, డివిజినల్ పంచాయతీ అధికారిని రూపారాణి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...