కరోనా కాటుకు బలైన రాజారావు
పెన్ పవర్, కందుకూరు
కందుకూరు టిఆర్ఆర్ కళాశాలలో రిటైర్డ్ హిందీ లెక్చరర్‌గా పనిచేసిన జిల్లెళ్ళమూడి రాజారావు (75) కరోనా మహమ్మారి కారణంగా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కందుకూరు పట్టణంలోని నందావారి వీధిలో ఆయన శనివారం నుండి అస్వస్థతకు గురయ్యారు. శ్రీరామనవమి పండుగ రోజు ఆయన ఆధ్వర్యంలో ఆ వీధిలో ఉన్న రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చిన ఆ కార్యక్రమం ద్వారానే ఆయన కరోనా బారిన పడ్డారని తెలిసింది. ముందు స్వల్ప లక్షణాలు కనిపించడంతో హోం ఐసోలేషన్ లో ఉండిపోయారు. సోమవారం అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఒంగోలులోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేర్చేందుకు ప్రయత్నించారు.అక్కడ ఖాళీలు లేకపోవడం తో అంబులెన్స్ లో మళ్ళీ కందుకూరుకు తీసుకు వచ్చారు.కందుకూరు లో అవకాశం లేకపోవడం తో రాజారావు ను తీసుకుని గుంటూరు లోని అమరావతి హాస్పిటల్ లో చేర్చారు.ఎంతో మందికి ఆత్మీయుడైన రాజారావు అందరినీ దుఃఖ సాగరంలో వదిలి తిరిగిరాని అనంత లోకాలకు వెళ్ళి పోయారు.రాజారావు మృతి పట్ల కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మానుగుంట కుటుంబానికి అత్యంత విధేయుడు.ఆంద్రాకేసరి సేవా సమితి, బ్రాహ్మణ సేవాసమితి,బ్రాహ్మణ ఉద్యోగ సమాక్య, కందుకూరు బ్రాహ్మణ ఆర్యవైశ్య సేవకులు, కందుకూరు కళావేదిక, కందుకూరు రిటైర్డ్ ఉద్యోగులు సంఘం, టి ఆర్ ఆర్ కళాశాల న్యాక్ సాధన సమితి,గాయత్రి విద్యాసంస్థల కరస్పాండెంట్ రామకృష్ణారావు, టి ఆర్ ఆర్ ప్రిన్సిపాల్ రవికుమార్ తదితరులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment