శ్రీ విజేత హైస్కూల్లో సర్వేపల్లి వర్ధంతి
తాళ్లపూడి, పెన్ పవర్మహనీయుల జీవితం విద్యార్థులకు మార్గదర్శకం అని తెలిపారు. శ్రీ విజేత హై స్కూల్ కరెస్పాండంట్ మోపిదేవి విజయలక్ష్మి శనివారం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి వర్ధంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులు రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కరెస్పాండంట్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు యువత మహనీయుల జీవితాలను అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నదని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి నుండి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి వరకు ఎదిగిన సర్వేపల్లి జీవితం నేటి ఉపాధ్యాయ లోకం కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు డా. జొన్నకూటి ప్రమోద్, ఉపాధ్యాయులు వెంకట్, స్వాతి, అరుంధతి, కరిష్మా, రేష్మ, కరుణ, భ్రమరాంబ పాల్గొన్నారు.
No comments:
Post a Comment