Followers

మళ్ళ వానలు పడుతాయట ....!

 మళ్ళ వానలు పడుతాయట ....!

పెద్దగూడూరు, పెన్ పవర్ 

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట వర్షాలకు దెబ్బ తినడంతో తలలు పట్టుకుంటున్నారు. బుధవారం కురిసిన వానలకు… వరి, మొక్కజొన్న, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా.. మరో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో  తేలికపాటి నుంచి ఓ మోస్తరు  వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.  మహబుబాబాద్ జిల్లాలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటపాటు కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొత్తగూడ మండలం కార్లాయి గ్రామంలో నిన్నకురిసిన వండగండ్ల వాన కు సుమారు 33 మంది రైతులకు సంబందించిన పంట పోలాలను కొత్తగూడ వ్యవసాయశాఖ అధికారి జక్కుల ఉదయ్ కుమార్ పంట పోలాలను పరిశీలంచారు. 66 ఎకరాలకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు. శుక్రవారం నాడు క్షేత్ర స్ధాయిలో రెవెన్యూ మరియు వ్వవసాయశాఖ అధికారులు సర్వే చేసి పూర్తి వివారాలు వెల్లడించనున్నారని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...