Followers

మహాత్మా జ్యోతి భాఫూలే జయంతి ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి

 మహాత్మా జ్యోతి భాఫూలే జయంతి ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి.......జాజుల లింగంగౌడ్

తార్నాక ,  పెన్ పవర్  

అణగారిన వర్గాల పితా మహుడు మహాత్మా ఫూలే 194 వ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు.కరోనాను కారణంగా చూపుతూ మహనీయులైన ఫూలే,అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదన్నారు. బార్లకు, పబ్బులకు లేని కరోనా కేవలం మహనీయుల జయంతి ఉత్సవాలకే ఉంటుందా అని బీసీ సంక్షేమ సంఘం ప్రశ్నిస్తుందన్నారు. గత  ఏడాది కరోనా కాలంలో కూడా మాజీ ప్రధాని పీవీ జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఎలా నిర్వహించారో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ సంక్షేమ శాఖను పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఈ సందర్బంగా జాజుల లింగంగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...