Followers

మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కరోనా కలకలం

 మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కరోనా కలకలం

పెన్ పవర్,  మంచిర్యాల 

జిల్లాలోని ఆర్టీసీ డిపోలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. గత రెండు రోజుల్లో ఇద్దరు డ్రైవర్లు కరోనాతో మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 12 మంది కార్మికులు కరోనా బారిన పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు, డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉన్నా. డిపోలోని బస్సులను శానిటైజ్ చేయడం లేదని కార్మికులు వాపోతున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి సరైన చికిత్స కూడా అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...