Followers

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం

 కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ  ప్రారంభం

పెన్ పవర్, రౌతులపూడి

రౌతులపూడిలో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను రౌతులపూడి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్వీ. నాయుడు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా తొలుత అయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలం లో గల 45 సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం 11-04-21 నుండి 14-04-21 వరకు  కార్యక్రమం జరుగుతుందని 45  సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని తెలిపారు. మండలం లో గల గ్రామ పంచాయితీ సర్పంచులు, గ్రామ వాలంటీర్లు,గ్రామ సచివాలయ సిబ్బంది, సెక్రటరీ లు, వి ఆర్ ఓ లు, ఆశా వర్కర్లు, డ్వాక్రా సిబ్బంది మొదలగు వారందరూ ప్రజలకు అవగాహన కల్పించి 45 సంవత్సరములు నిండిన వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయించే బాధ్యతను తీసుకొని ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...