Followers

కవిరత్న బీవీవీకి “కవిచంద్ర మద్దా” పురస్కారం

 కవిరత్న బీవీవీకి “కవిచంద్ర మద్దా”  పురస్కారం




అమలాపురం, పెన్ పవర్:
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్మీప్రసాద్  చేతుల మీదుగా అమలాపురం నకు చెందిన కవి, రచయిత, కవిరత్న బీవీవీ సత్యనారాయణ “కవిచంద్ర మద్దా సత్యనారాయణ స్మారక పురస్కారము” అందుకున్నారు.  ఫిలాంథ్రీఫిక్ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షులు అద్దంకి రాజయోనా  ఆంధ్రప్రదేశ్  నుండి మద్దా పురస్కారముకోసం  కవి బీవీవీ ఎంపిక చేసారు. పురస్కారము  మరియు ఉగాది విశిష్ట సేవా పురస్కారముతో అందజేసారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 25మంది విశిష్ట వ్యక్తులకు  వైజాగ్ లోని ద్వారకానగర్ నందు గల పౌర గ్రంధాలయము నందు ఏర్పాటు చేసిన ఉగాది విశిష్ట సేవా పురస్కారములు ప్రధానం చేసారు.   ఈకార్యక్రమములో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అద్దంకి రాజయోనా, గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత డా. కూటికుప్పల సూర్యారావు, రొయ్యూరి శేషసాయి, కళారత్న లయన్ డా. ఎస్ పీ భారతి, ఆకాశవాణి సీనియర్ ఎనౌన్సర్ డా. బండి సత్యనారాయణ, డా. గూటం స్వామి, సర్కిల్ ఇనస్పెక్టరు ఆకుల రఘు వంటి ప్రముఖుల చేతులమీదుగా ఈ పురస్కారములు అందించడం జరిగింది.ఆంధ్రానుండి తనను కవిచంద్ర మద్దా స్మారక పురస్కారమునకు ఎంపిక చేయడం పట్ల కవి బీవీవీ  ఫిలాంథ్రోఫిక్ ఇంటర్నేషనల్ సంస్థ రాజయోనా కు  కృతజ్ఞతలు  తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...