చీకటి కమ్మిన చినలబుడు గ్రామంచాయతీ, పట్టించుకోని విద్యుత్ అధికారులు...
అరకు, పెన్ పవర్
చీకటి కమ్మిన చినలబుడు గ్రామంచాయతీ, పట్టించుకోని విద్యుత్ అధికారులు, తక్షణమే కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్.శుక్రవారం(అరకువేలి) ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ శుక్రవారం చినలబుడు గ్రామపంచాయతీ పరిధిలోగల మాలివలస మంజగుడా పకనకుడి తుడుం మాలసింగారం చినలబుడు గ్రామాలకు పర్యటించి ఆ గ్రామ ప్రజల ద్వార వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో చాలా గ్రామాలు కరెంటు సమస్యలతో సంవత్సరాల తరబడి ఇబ్బందిపడుతున్నరని, కొండకి చెరువులో ఉన్నందున రాత్రిపూట కరెంటు లేక మహిళలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు చిన్నపిల్లలు చాలా అవస్థలు పడుతున్నారని,తరచుగా కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ లు కాలిపోయినా కరెంట్ (విద్యుత్) అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ లు ఇవ్వడంలో నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారని,దీంతో కడుపుమండిన గ్రామపంచాయతీ ప్రజలు ఆందోళన బాట చేపట్టావలసి వస్తుందని,ఎన్నిసార్లు అధికారుల పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పాలకులు విద్యుత్ అధికారులు ఏమాత్రం ఇంతవరకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లను అమర్చడంలో దృష్టి పెట్టడం లేదని, ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని అన్నారు.
ఈ గ్రామాలకు ఇంతకుముందు సుమారు 20 సంవత్సరాల క్రితం ఏసిన కరెంట్ స్తంభాలు వైర్లు 45 హెచ్‌పీ మినీ ట్రాన్స్‌ఫార్మర్లు ఇప్పటికీ వాటిని కొనసాగించడం వలన, లోవోల్టేజీ సమస్య ఏర్పడి వైర్లు తెగిపోవడం స్తంభాలు పడిపోవడం తరచుగ మినీ ట్రాన్స్‌ఫార్మర్ బుడ్లు కాలిపోవడం వంటివి జరుగుతున్నాయని ఆ ట్రాన్స్ ఫార్మర్ ల నుండి ఆయిల్ కారిపోతున్నాయని.కొత్త ట్రాన్స్‌ఫారం ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకునే నాధుడే లేడని.ట్రాన్స్‌ఫారం కాలిపోతే 24 గంటలు గడిచేలోపు ప్రత్యేమ్నాయంగా ఇంకో ట్రాన్స్‌ఫార్మర్ అమర్చవల్సి ఉన్నా,సకాలంలో అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను అందించలేకపోతున్నారని.ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుచేసే సిబ్బంది డబ్బులు ఇవ్వనిదే ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతు చేసి ఇచ్చే పరిస్థితి ఉండటం లేదని అధికారులపై మండిపడ్డారు.ఇప్పటికైనా పాలకులు విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి గ్రామ పంచాయతీ లో గల పలు గ్రామాలకు త్రి పెస్ కరెంటు లైన్ తో హెవీ ఓల్టేజ్ కెపాసిటీ ట్రాన్స్ ఫార్మర్ లు మంజూరు చేయాలని కరెంట్ సమస్యలపై తక్షణమే తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వార్డు నెంబర్ పాంగి సింహాద్రి సుంకరి బాలమురళి పొండోయి రాము మొస్య మంగేలి కిల్లో రఘురాం మొస్య మాణిక్యం పొండోయి మిస్యమ్మ కొర్ర ప్రదీప్ కుమార్ పొండోయి లైకొన్ పాంగి లక్ష్మి వంతల రంభ వంతల భాస్కర్ రావు వంతల మదు పాంగి ప్రసాద్ వంతల సోమ పాంగి మొతి గ్రామపంచాయతీ ప్రజలు మహిళలు యువకులు పాల్గొనడం జరిగింది.
No comments:
Post a Comment