విశాఖ ఉత్తర నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విజయసాయి రెడ్డి
విశాఖ ఉత్తరం, పెన్ పవర్విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి శుక్రవారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించి 3 కోట్ల, 92 లక్షల, 58 వేల రూపాయలు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.వీటిలో 51 వ వార్డు ఏకలవ్య కాలనీ లో బీటీ రోడ్స్, సి సి రోడ్స్ ,ఆర్ సి సి కల్వర్టు లకు,49 వ వార్డు లో ఎస్ ఆర్ నగర్ లో సామాజిక భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులకు.48 వ వార్డు ఇందిరా నగర్ లో సీవెజ్ కాలువలకు.55 వార్డు ధర్మా నగర్ లో హైవే సర్వీస్ రోడ్డు పక్కన మురుగునీటి కాలువలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా విశాఖ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్ది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడమేకాక ఈ నగరాన్ని మురికివాడ రహిత నగరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము అందరం పనిచేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు,పార్లమెంట్ సభ్యులు ఎం.వి.వి సత్యనారాయణ,జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి,జీవీఎంసీ కమిషనర్ సృజన,జీవీఎంసీ డిప్యూటీ మేయర్ లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్,రాష్ట్ర కార్యదర్శులు సనపల చంద్రమౌళి,రొంగళి జగన్నాథం,మరియు వార్డ్ కార్పొరేట్లు రేయ్యి వెంకటరమణ,అల్లు శంకర్ రావు,శశికళ,వార్డ్ ఇంచార్జి గుత్తలనీలి తిరుమల దేవి,నీలి రవి,మరియు జీవీఎంసీ అధికారులు ఇతర ఇంజనీరింగ్ అధికారులు,మాజీ కార్పొరేటర్లు,బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు,వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment