Followers

కరోనా నివారణకు మాస్కులు తప్పనిసరి

 కరోనా నివారణకు మాస్కులు తప్పనిసరి 

జగ్గంపేట, పెన్ పవర్

జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలందరికీ కరోనా  సెకండ్ వేవ్ విస్తృత ప్రభావాన్ని క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ చైర్మన్ జుత్తుక నాగేశ్వరరావు వివరించారు. అక్కడ పని చేస్తున్న  కూలీలు అందరికీ మాస్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విస్తరించకుండా మాస్కు, సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరు కూడా కరోనా పట్ల అజాగ్రత్తగా ఉండకుండా తమ పనులను ప్రభుత్వం వారు సూచనల మేరకు ప  తమ పనులు తాము చేసుకుంటూ ఈ కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవాలని అలాగే 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని  సూచించారు.

 ఫీల్డ్ అసిస్టెంట్ , గ్రూపు మేట్లు, వారి చేతుల మీదుగా మాస్క్ ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని క్యాండిల్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జుత్తుక  నాగేశ్వరరావు తమ సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తమఅందరికీ కూడా కరోనా జాగ్రత్తలు గురించి చెబుతూ మాస్కులు పంచి పెట్టడం మాకు ఎంతో  సంతోషకరమని తెలిపారు.పనిలోకి వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అలాగే జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఎవరైనా కరోనాబాధితులు ఉన్నట్లయితే వారికి భోజనం అలాగే వారికి కావలసిన సరుకులు ,ఇవ్వడానికివారినిసంప్రదించినట్లయితే  ఆ సంస్థ ఇవ్వడానికి ముందు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో  యూత్ సభ్యులు మోజేష్, రాజేష్, జీవన్ కుమార్ ,నో హావు, ప్రసాదు ,కరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...