బీఎస్ఎన్ఎల్ సేవల్లో తీవ్ర అంతరాయం...
అసహనం వ్యక్తం చేస్తున్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు...
బేల, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బిఎస్ఎన్ఎల్ సేవలకు తరచూ అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో అత్యధికంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులే ఉన్న అందుకు తగ్గట్టు సేవలు అందించడంలో బీఎస్ఎన్ఎల్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బేలా తోపాటు చప్రల, సైద్ పూర్ గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్ లను ఏర్పాటు చేశారు. ఆయా టవర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే చాలు సాంకేతల సమస్య తలెత్తడంతో అంతర్జాల సేవలు నిలిచిపోతున్నాయి. కొన్నిచోట్ల జనరేటర్ సౌకర్యం ఉన్న బిఎస్ఎన్ఎల్ సిబ్బంది స్థానికంగా ఉండకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతుంది. బేలా లో కార్యాలయం ఉన్న ఎవరు ఉండడం లేదు. ఎప్పుడో ఒకసారి చుట్టంలా వచ్చి చూసి పోతున్నారని స్థానికులు తెలిపారు. ఫలితంగా చాలా మంది వినియోగదారులు ఇతర కంపెనీల నెట్వర్క్ లో మారుతున్నారు. మండలంలోని 53 గ్రామాలకు సాంకేతల సమస్యలతో బిఎస్ఎన్ఎల్ ఫోన్లు పనిచేయడం లేదని, ఈ విషయాన్ని ఉన్నత బిఎస్ఎన్ఎల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని వినియోగదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ ముక్కవార్ ఆరోపించారు.
No comments:
Post a Comment