బోర్ల మరమ్మత్తులు చేసి..నీటి బాధలు తీర్చండి..సిపిఐ మహేష్..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్జగత్గిరిగుట్ట డివిజన్ మక్దుం నగర్లో పాడై పోయిన బోర్లను మరమ్మత్తులు చేయాలని ప్రజలకు త్రాగునీటి నీటి సమస్యను పరిష్కరంచాలని సిపిఐ ఆధ్వర్యంలో వాటర్ వర్క్స్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.. 2నెలలుగా సంబంధిత అధికారి అమర్నాథ్ దృష్టికి తీసుకెళ్ళినా కాలయాపన చేస్తున్నారని సమస్యను పరిష్కరించడం లేదని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఐడీపీల్ లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ అందుబాటులో లేకపోవడoతో సూపరింటెండెంట్ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని సిపిఐ నాయకులు పేర్కొన్నారు భగత్ సింగ్ మార్గ్ లో బోర్ పాడై చాలా నెలల అయ్యిన విషయాన్ని సంబందిత అధికారులకు తెలియచేసిన కూడా సమస్యను పట్టించుకోకుండా, నిధులు లేవు,మాకు 200 బోర్లు ఉన్నాయి అని తప్పించుకుంటునరే తప్ప పని చెయ్యట్లేదని వెంటనే సమస్యను పరిష్కరించాలని మహేష్ కోరారు.. లేనిపక్షంలో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.. వెంటనే స్పందించిన అధికారులు ఇవ్వాలో, రేపు కచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని హామీ అధికారులు హామీ ఇచ్చినట్లు సిపిఐ నాయకులు తెలిపారు.. ఒకవేళ 2 రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, మహిళ సమాఖ్య అధ్యక్షురాలు పర్వీనా సుల్తానా,సీపీఐ కార్యవర్గ సభ్యులు నర్సయ్య,వెంకట్ రెడ్డి, సీపీఐ నాయకులు యాకుబ్,ఇమామ్, యాదన్న, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment