అనకాపల్లి రైల్వేస్టేషన్ ను మోడల్ స్టేషన్ గా మార్చండి
నర్సిపట్నం స్టేషన్ లో రత్నాచల్ కు హల్ట్ ఇవ్వండి
విశాఖ ద్వారాకనగర్,పెన్ పవర్
రైల్వే బోర్డ్ మెంబర్ బొడ్డు శ్రీరామ్మూర్తి గురువారం అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీశెట్టి సత్యవతిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా బొడ్డు శ్రీరామ్మూర్తి అనకాపల్లి రైల్వేస్టేషన్ ను మోడల్ స్టేషన్ గా తీర్చి దిద్దాలని , అదనంగా మరి కొన్ని ప్లాట్ ఫారాలను నిర్మించాలని , ప్రయాణికులను అనుకూలంగా ఎస్కేలేటర్ లను నిర్మించాలని , లక్ష్మీ దేవి పేట వద్ద అసంపూర్ణంగా ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ను పూర్తిచేయాలని , రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కు యలమంచిలి స్టేషన్ లో హల్ట్ ఇవ్వాలని , ఈ విషయంలో ఆనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతమ్మ సెంట్రల్ రైల్వే మంత్రి పియూష్ గోయల్ కు అభ్యర్ధన పత్రాన్ని సమర్పించారని ,ముఖ్యంగా ఈ వేసవిలో స్టేషన్ లో మంచినీటి సమస్య రాకుండా చూడాలని , ప్రయాణికులకు ఏ లోటూ రాకుండా అన్నివిధాల సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేసారు. అంతేకాకుండా రైల్వే బోర్డ్ సమావేశం గురించి చర్చించారు. అందుకు ఆమె రైల్వే బోర్డు సమావేశం ఈ నెల మొదటి వారంలో ఉంటుందని బోర్డ్ మెంబర్లతో కూలంకషంగా సమస్యల పై చర్చిస్తానని తెలియజేసారు. ఈ సమావేశంలో ఓరుగంటి నెహ్రూ బాబు,జ్యోతుల రమేశ్,బొడ్డు సునీల్ పొల్గొన్నారు.
No comments:
Post a Comment