ఎల్లారెడ్డిపేట మండలం లో విజృంభిస్తున్న కరోనా
43 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు
మండల వైద్యాదికారులు డాక్టర్లు ధర్మానాయక్, మానస ల వెల్లడి
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్ఎల్లారెడ్డిపేట మండలంలో కరోనా వ్యాది విజృంభింస్తుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఆదివారం కరోనా నిర్ధారణ కోసం 125 మందికి పరీక్షలు చేయగా 43 మంది కి కరోనా పాజిటివ్ వచ్చినట్టు 82 మందికి నెగెటివ్ వచ్చినట్టు మండల వైద్యాదికారులు డాక్టర్లు ధర్మానాయక్ మానస లు తెలిపారు. ఎల్లారెడ్డిపేట లో ఐదుగురికి కిషన్ దాస్ పేటలో ముగ్గురికి అక్కపల్లిలో ముగ్గురికి అల్మాస్ పూర్ లో ఒకరికి. అగ్రహారం లో ఇద్దరికి. వీర్నపల్లిలో ముగ్గురికీ. గోల్లపల్లి లో నలుగురికి. నారాయణ పూర్ లో ముగ్గురికి. బోప్పాపూర్ లో ఐదుగురికి. సింగారంలో ముగ్గురికి. వెంకటాపూర్ లో ముగ్గురికీ. హారిదాస్ నగర్ లో ఒకరికి. పదిరలో ముగ్గురికి. వన్ పల్లిలో ఒకరికి. రాజన్నపేటలో ఒకరికి. ఇతరులు ఒకరికి. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు నిర్దారణ అయ్యిందన్నారు. కరోనా నిర్దారణ అయిన వ్యక్తులు కంట్రోల్ అయ్యేంతవరకు కుటుంబ సభ్యులకు దూరంగా మాస్కులు దరించి ఉండాలని . ప్రతి రోజు గోరువెచ్చని నీటినే తాగాలనీ వారు పిలుపునిచ్చారు. విహారయాత్రలకు హైదరాబాద్ మరియు మహారాష్ట్ర ఇతర ఏదైనా రాష్ట్రం నుంచి వచ్చారో వారు తప్పకుండ కోవీడ్ పరీక్షలు చేయించుకోవాలనీ జ్వరం. దగ్గు. జలుబు. మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే హోమ్ క్వారెంటెన్ లో ఉండాలన్నారు. కరోనా సోకినట్టు అనుమానం ఉన్న వ్యక్తులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో సంప్రదించి కరోనా పరీక్షలు చేయించు కోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్, మానస, లు కోరారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో కోవీడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్నీ ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు శుక్రవారం 244 మందికి కరోనా వాక్సిన్ వేసినట్లు డాక్టర్లు ధర్మానాయక్ .మానస లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాల వయస్సు పై బడిన ప్రతి ఒక్కరికీ ( దీర్ఘకాలిక వ్యాదులతో సంబంధంలేకుండా ) వాక్సిన్ ఇవ్వబడుతుందన్నారు. లబ్దిదారులు అందరు కూడా ఆధార్ కార్డ్ తో రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా సద్వినియోగ పర్చుకోవాలనీ ధర్మానాయక్ మానస లు కోరారు.
No comments:
Post a Comment