Followers

కరోనా కట్టడికి.శివ సాయి నగర్ లో శానిటేషన్

 కరోనా కట్టడికి.శివ సాయి నగర్ లో శానిటేషన్

పెన్ పవర్,  కాప్రా

 చర్లపల్లి డివిజన్ పరిధిలోని శివ సాయి నగర్ లో 15 మంది కోవిడ్ పాజిటివ్ తో బాధపడుతుండగా కాప్రా సర్కిల్ ఎంటమాలజీ సిబ్బంది శుక్రవారం కాలనీలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆదేశాల మేరకు శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపల్లి పద్మా రెడ్డి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తేనే కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం అన్నారు.గత ఏడాది కాలంగా స్వచ్ఛ కార్యక్రమాలతో కాప్రా సర్కిల్ లోనే ఆదర్శంగా నిలిచిన శివ సాయి నగర్ లో కోవిడ్ పాజిటివ్ తో పది కుటుంబాలకు పైనే బాధపడుతున్న విషయాన్ని కాప్రా సర్కిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని కోరినా స్పందించలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.కాగా ఇదే విషయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శానిటైజేషన్ కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని కోరడంతో ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో ఎంటమాలజీ సిబ్బంది కాలనీలోనీ ప్రతి వీధిలో శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో  శివ సాయి నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు బర్ల రామచంద్రారెడ్డి, కాసుల సురేష్ గౌడ్, శివలింగం, షాబాద్ దామోదర్ రెడ్డి, రాందాస్ ,రాజిరెడ్డి, శ్రీను, అంజయ్య గౌడ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...