Followers

కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని విళవిళ ఆడుతున్న ఆగ్రహారం గ్రామాన్నీ సందర్శించిన టిఆర్ఎస్ నాయకులు

కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని విళవిళ ఆడుతున్న ఆగ్రహారం గ్రామాన్నీ సందర్శించిన టిఆర్ఎస్ నాయకులు

కరోనా తో భాధ పడుతున్న వారిని సామాజిక దూరం నుంచి పలకరింపు.మనోదైర్యం

ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

కరోనా కోరల్లో చిక్కుకొని విళవిళ లాడుతున్న ఎల్లారెడ్డిపేట మండలం ఆగ్రహారం గ్రామాన్నీ. కరోనా వ్యాది భారిన పడి బాధ పడుతున్న వారిని శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు. నాయకుల బృందం  ఆ గ్రామానికి వెళ్ళీ సామాజిక ధూరం నుంచి వారిని పలకరించి మనోదైర్యం కల్పించారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అదికార ప్రతినిధి తోట ఆగయ్య జడ్పీటీసీ చీటి లక్ష్మన్ రావు ల ఆధ్వర్యంలో ఆ గ్రామానికి వెళ్ళిన ప్రతినిధి బృందం గ్రామంలో తిరిగి ప్రజలకు మనోదైర్యం కల్పించారు. తోట ఆగయ్య గ్రామంలో తిరుగుతూ కరోనా వైరస్ కు  భయపడవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఓక్కరు  మాస్కులు ధరించాలనీ సామాజిక దూరం పాటించాలని  గోరువెచ్చని నీటినీ తాగాలనీ సూచనలు చేశారు. ప్రభుత్వ వైద్యులు ఆశాకార్యకర్తలు. ఎఎన్ఎం లిచ్చే మందులను వాడాలనీ.కరోనా టెస్టు లు చేయించుకోవాలనీ. 40 సంవత్సరాల వయస్సు పై బడ్డ వారు వాక్సిన్ వేసుకోవాలనీ ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల టిఆర్ఎస్ పార్టీ  ప్రసిడెంట్ వర్ష కృష్ణహారి. రైతు సమన్వయ సమితి అద్యక్షులు శంకర్ .పిల్లి కిషన్. స్ధానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...