జీడిమెట్లలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..
జీడిమెట్ల, పెన్ పవర్
దేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతి వేడుకలను జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం, హరిజన బస్తీలో మాదిగ చైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కె.పి.విశాల్ గౌడ్ విచ్చేసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు.. మహనీయుల ఆశయ సాదనకు తామంతా నిలవాలని,ఆయన అడుగు జాడలో నడవాలని విశాల్ తెలియ చేశారు..ఈ కార్యక్రమంలో యం.సి.డబ్ల్యూ.ఏ అధ్యక్షులు గుడ్డి బలరాం, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి శ్రీనివాస్, సాయిలు, పులి బలరాం, నవీన్ కుమార్, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment