అట్రాసిటి కేసుపై విచారణ
తాండూర్ , పెన్ పవర్మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం,మాదారం టౌన్షిప్ లో అట్రాసిటి కేసు విషయమై బెల్లంపల్లి ఎ.సి.పి రహమాన్ సాక్ష్యులను విచారించారు. మాదారం టౌన్షిప్ కి చెందిన ఇడిగిరాల మల్లేష్ అనే వ్యక్తిని కుచ్చుల పెంటయ్య అనే వ్యక్తి కులం పేరుతో దూషించాడని స్థానిక పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణ నిమిత్తమై శుక్రవారం రోజున బెల్లంపల్లి ఎ.సి.పి రహమాన్, మాదారం ఎస్.ఐ మానస వచ్చి నిజ నిజాలను తెలుసుకున్నారు.
No comments:
Post a Comment