Followers

వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఆధర్శం

 వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఆధర్శం

వాలంటీర్ల అవార్డు ప్రధానంలో జెసీ లక్ష్మీశ



సామర్లకోట, పెన్ పవర్:

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంబించిన వాలంటీర్ల వ్యవస్థ యావత్ దేశం మొత్తంలో ఆధర్శంగా నిలిచిందని జిల్లా జాయింటు కలెక్టర్ డా. జి లక్ష్మీశ అన్నారు. సామర్లకోట పట్టణంలోని పూర్ణ కళ్యాణ మడపంలో  పెద్దాపురం నియోజక వర్గానికి సంబందించి వాలంటీర్లు సేవలకు అవార్డు ప్రధానోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జాయింటు కలెక్టర్ లక్ష్మిశ, అడిషనల్ ఎస్సీ కరణం కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని జెసీ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంబించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేవలం రెండు గంటల్లో లబ్దిదారుల గడప వద్దకు సంక్షేమ పదకాలను అందించేందుకు రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేయగా వాలంటీర్లు వారి బాధ్యతలను ఎంతో విజయవంతంగా పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. దానికి గానూ వాలంటీర్ల సేవలను ఆయన ప్రశంసించారు. 




లబ్దిదారులు ఆశించిన సేవలను ఇంటివద్దకు చేర్చే విధంగా పని చేస్తున్న వాలంటరీ వ్యవస్థ ప్రస్తుతం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రారంభ దశలో ఈ వ్యవస్థపై కొంత ఆశక్తికర అంశాలు వచ్చాయన్నారు. అయితే వాలంటీర్ల పనితీరుతో మంచి ఫలితాలు చూస్తున్నామన్నారు. ఉషోదయ సమయానికే వృద్ధులు, వికలాంగులకు పించన్లు అందిచడం, రేషన్ కార్డులను సకాలంలో  అందించడం వంటి పనుల ద్వారా వాలంటీర్లు పేద ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. వీరి సేవలను గుర్తించి ప్రభుత్వం వీటి- సేవాప్తి, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ మాట్లాడుతూ కష్ట సమయంలో పోలీసులు ప్రజలకు సేవా కార్యక్రమాలను అందించడం జరుగుతుందని, కరోనా సమయంలో 11 వందల మంది పోలీసులు కరోనా బారిన పడితే వాలంటీర్లు నేరుగా వచ్చి పోలీసులకు సేవలను అందించడం గొప్ప విషయమన్నారు. గతంలో క్షేత్ర స్థాయిలో తమకు ఏదైనా సమాచారం అవసరమైతే ఎంతో సమయం పట్టేదన్నారు. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అతి సులభంగా అతి తక్కువ సమయంలో అందుతుందన్నారు. ఇంకా కార్యక్రమంలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ చైర్ పర్శన్లు తులసీ మంగతాయారు, గంగిరెడ్డి అరుణలు, రాష్ట్ర కార్మిక నాయకులు, కాపా సీనియర్ నాయకులు దవులూరి సుబ్బారావు, జెడ్పీ సీఇవో ఎన్వెవి సత్యన్నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఊభా జాన్ మోజెస్, నెక్కంటి సాయి ప్రసాదు, డిఆర్‌డిఎ పిడి హరిహరనాద్, ఆర్డీవో ఎస్ మల్లిబాబు తదితరులు మాట్లాడుతూ వాలంటీరల సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా పెద్దాపురం నియోజక వర్గ పరిధిలో 5 సేవావజ్ర, 20 సేవారత్న, 1251 మందికి సేవామిత్ర అవార్డులను జెసీ, ఆడిషనల్ ఎస్సీల చేతులమీదుగా ప్రధానం చేసారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందు కళ్యాణ మండప ఆవరణలో డిఆర్డిఎ ఆధ్వర్యంలో నవరత్నాల పథకాలకు సంబందించి రంగవల్లులను, వివిద పదకాలను తెలిపే ప్రధర్శనను ఏర్పాటు చేయగా అవి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిపివో కె నాగేశ్వర్ నాయక్, పెద్దాపురం డిఎస్పీ ఎ శ్రీనివాసరావు, మున్సిపల్ కమీషనర్లు బిఆర్ఎస్ శేషాద్రి, నియోజక వర్గ పరిదిలోని కౌన్సిలర్లు, సర్పంచిలు, పంచాయితీ, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులు  పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...