బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి
మందమర్రి, పెన్ పవర్
బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని మందమర్రి పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ పోటీలు బంగారు పథకాలు సాధించిన పట్టణ విద్యార్థులను శుక్రవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫునకోషి శోతోకొన్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కరాటే ఇండియా నిర్వహించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు గోవాలో మార్చి 28,29 నిర్వహించబడ్డాయని, ఈపోటిలలో 800 మంది విద్యార్థులు పాల్గొనగా మందమర్రి పట్టణానికి చెందిన డ్రాగన్ కరాటే కుంగ్ ఫూ అకాడమీ విద్యార్థినిలు జి శివాని,డి హర్షిత శర్మలు చక్కటి ప్రతిభ కనబరచి పతకాలు సాధించారని ఆయన తెలిపారు. అండర్ 14 విభాగంలో జి శివాని కుమిటి,కటాస్ లో బంగారు,వెండి పతకాలు సాధించగా, అండర్ 17 విభాగంలో డి హర్షిత శర్మ కటాస్,కుమిటి లో బంగారు, వెండి పతకాలు సాధించారన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని పేర్కొన్నారు. శివాని, హర్షిత లు భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజా గౌడ్, కరాటే మాస్టర్ వెంకటేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment