కోవిడ్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత....
పెన్ పవర్, ఉలవపాడు
మండలంలోని భీమవరం బద్దిపూడి కృష్ణాపురం గ్రామ పంచాయతీలలో ఈరోజు కోవిడ్ పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు అధ్యక్షతన జరిగిన కరోనా అవగాహన సదస్సులో తాసిల్దార్ కె సంజీవ్ రావు గారు ఎంపీడీవో టి రవి కుమార్, చాకిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని రాజ్యలక్ష్మి పాల్గొని కరోనా నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రవర్తనా నియమావళి గురించి తెలియపరిచారు. మరియు ఈరోజు నుంచి ప్రారంభమైన 18 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ కొరకు రిజిస్ట్రేషన్ అందరు వినియోగించుకుని మే ఒకటో తేదీ నుండి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. రెండో విడత తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ వైద్య శాస్త్రానికి సవాలు గా మిగిలిందని నివారణ తప్ప చికిత్స లేదని గుర్తు చేశారు. అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఆకస్మికంగా కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఊపిరాడని పరిస్థితి సంభవించడం ద్వారా ఆక్సిజన్, వెంటిలేటర్ వినియోగం పెరిగిందని. రోగులకు వైద్య సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తెరిగి ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తూ, వ్యక్తిగత పరివర్తనతో నడుచుకోవాలని, కరోనా లక్షణాలు కనిపించినా, బయటి ప్రాంతాల నుంచి వ్యక్తులు తిరిగి తమ గ్రామానికి వచ్చినప్పుడు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాపారస్తులు పరిమిత వేళల్లోనే వ్యాపారం నిర్వహించుకోవాలని తెలిపారు. అవసరం లేనిది బయటకు రావద్దని, ఎప్పటికప్పుడు శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవాలి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఉల్లంఘించితే జరీమానా తప్పదన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచులు కూనం. అనిల్ కుమార్ రెడ్డి, మేడిద రాజమ్మ మందాడి సుశీలమ్మ,పంచాయతీ కార్యదర్శులు లక్ష్మీ లత, కెజియారాణీ, ప్రసాద్ , విలేజ్ రెవెన్యూ అధికారులు బాలచంద్ర, రవి, పీరయ్య, గ్రామ నాయకులు చీమకుర్తి కృష్ణారెడ్డి సచివాలయ సిబ్బంది ఆరోగ్య శాఖ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment