కర్నాటక మద్యం, అక్రమ రవాణా గుట్టు రట్టు..
5,04,000/- రూపాయలు విలువ గల కర్నాటక మద్యం, అక్రమ రవాణాకు ఉపయోగించిన 40,00,000/- విలువైన 3 కార్లు మరియు నలుగురు వ్యక్తుల అరెస్టు. రాజశ్రీ చిత్తూరు ఎస్పి సెంథిల్ కుమార్, సబ్ ఎస్ పి శరిశాంత్ రెడ్డి కి కర్నాటక మద్యం అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారం మేరకు, సబ్-డివిజినల్ పోలీస్ ఆఫీసర్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో చిత్తూరు II టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ పి.యుగంధర్, ఎస్ ఐ ఎస్.మల్లికార్జున మరియు వారి సిబ్బంది కలసి ఈ రోజు అనగా 20-04-2021 వ తేదీ ఉదయం 6.00 గంటలకు చిత్తూరు టౌన్ లోని తేనెబండ, రాజీవ్ నగర్ లోని జటాలమ్మ గుడికి సమీపములోని చెట్ల పొదల వద్దకు వెళ్ళగా అక్కడ కొంతమంది వ్యక్తులు మూడు కార్లను ఆపి అందులో నుండి మద్యం అట్టపెట్టె బాక్సులను కిందికి దించుచుండగా పోలీసులు స్వాధీన పరుచుకోవడమైనది.
అంతట చిత్తూరు II టౌన్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది కలసి చిత్తూరు టౌన్, తేనేబండ, రాజీవ్ నగర్ కు చెందిన యన్.జ్యోతీశ్వరన్ @ జ్యోతి, మదనపల్లి టౌన్ కు చెందిన చామంచి మల్లికార్జున, కోలారుకు చెందిన వి.మోహన్, ఐరాల మండలం, నాంపల్లికి చెందిన ప్రదీప్@ బక్కోడు అను వారిని పట్టుకోవడమైనది. అంతట వారు కర్నాటక నుండి చిత్తూరు కు తరలిస్తున్న అక్రమ మద్యం 70 బాక్సులను మరియు వాటిని తరలించడానికి ఉపయోగించిన 03 విలువైన కార్లను సీజ్ చేయడం జరిగినది. ఈ మధ్యమ్ అంతయూ కర్నాటక రాష్ట్రములో, చిత్తూరు జిల్లాకు బార్డర్ లో ఉన్న కోలార్ జిల్లా, ముళభాగల్ తాలూకా, బేరిపల్లి గ్రామము, గుడిపల్లి రోడ్ లో ఉన్న నర్తకి బార్ & రెస్టారెంట్ కి చెందిన ఓనరు బసవరాజు అను అతని యొక్క బార్ & రెస్టారెంట్ నుండి తీసుకొని రావడమైనది.
No comments:
Post a Comment