Followers

కర్ఫ్యూ నిబంధనలు పాటించాలి

 కర్ఫ్యూ నిబంధనలు పాటించాలి;  తహశీల్దార్ కోమల

చిన్నగూడూరు, పెన్ పవర్ 

స్థానిక మండల కేంద్రం లోని బుధవారం నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాను సారం కర్ఫ్యూ ఉంటుందని చిన్నగూడూరు తహశీల్దార్ కోమల అన్నారు. ఈ సందర్భంగా ఆమే స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ.. రెండవ దశ కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చిన సందర్భంగా వైరస్ నియంత్రణ కు అందరి సహకరించాలని తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలను రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 5 గంటల వరకు  కొనసాగుతాయని అన్నారు. ఇందులో భాగంగా అత్యవసర సేవలైన వైద్యం, మెడికల్, పేట్రోల్ బంక్ లు, ఇంటర్నెట్ , టెలికమ్యూనికేషన్స్, మీడియా, తదితర అత్యవసర పనుల నిమిత్తం  ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని తెలిపారు. వైన్ షాపులు, బెల్ట్ షాపులు, హోటల్, రెస్టారెంట్లు, వంటి కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని కోరారు. నిబందనలు అతిక్రమిస్తే 2005 విపత్తు చట్టం ప్రకారం 51 నుండి 60 వరుకు, ఐటీసీ సెక్షన్188 ప్రకారం ఉల్లంఘించి వారిపైన కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ కోమల తెలిపారు. అందరు కర్ఫ్యూ ను పాటించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది వి ఆర్ ఓ సుదర్శన్ నాయుడు, ఆర్ ఐ వెంకన్న, లస్కర్ , జంపాల సురేష్, దితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...