Followers

సంఘ సంస్కర్త కందుకూరికి ఎంపీ మార్గాని ఘన నివాళి

సంఘ సంస్కర్త కందుకూరికి ఎంపీ మార్గాని ఘన నివాళి

రాజమహేంద్రవరం,పెన్ పవర్

సంఘ సంస్కర్త, యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణీ సమాజంలోని విద్యా సంస్థలను విద్యా శాఖలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నానని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు, వైకాపా పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌ రామ్‌ హామీ ఇచ్చారు.కందుకూరి వీరేశిలింగం జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మార్గాని భరత్ రామ్ శుక్రవారం స్థానిక ఎస్‌కెవిటి కళాశాల ప్రాంగణంలోని ఆనంద గార్డెన్స్‌లోని కందుకూరి సమాధి వద్ద ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ ఘనంగా నివాళులర్పించారు.అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ, నగర వైసీపీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ కందుకూరి సమాధులకు పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హితకారణి సమాజం విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై దేవదాయ శాఖ ఈఒతో జీతాల పెండి న్గ్ పై చర్చించారు.కనీస జీతం లేకుండా ఐదు వేల జీతంతో పనిచేస్తున్నామని, అదీ కూడా ఐదు నెలలుగా బకాయిలు ఉన్నాయని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల పెండింగును తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఈఒను ఆదేశించారు. అయితే హితకారిణీ సమాజంలోని విద్యా సంస్థలను ప్రభుత్వరంగంలోని విద్యారంగానికి విలీనం చేసేందుకు ప్రభుత్వంతో చర్చించామని, సంబంధిత విద్యా శాఖ, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. విద్యా శాఖలో విలీనం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఖాళీ పోస్టుల స్థానే నూతన నియామకాలు చేపట్టాలని అధికారులతో చర్చించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గ వైకాపా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, వైకాపా నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, నాయకులు బొంతా శ్రీహరి, పెంకే సురేష్‌ కుమార్ తదితరులు నివాళుర్పించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...