Followers

నేటి నుండి కోవిడ్ నిబంధనలలో మార్పులు

 నేటి నుండి  కోవిడ్ నిబంధనలలో  మార్పులు

 దుకాణాలు సమయపాలన లో మార్పులు           
వచ్చే నెల 10 వరకు కొనసాగింపు    
 పాల ఉత్పత్తులు, అత్యవసర సేవలకు మినహాయింపు         
మండల టాస్క్ఫోర్స్ కమిటీ లో కీలక నిర్ణయాలు      
పెన్ పవర్, కందుకూరు

 నేటి నుండి రెండవ దశ కరోనా ఉదృతంగా ఉన్న దృష్ట్యా నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ అన్నారు. సోమవారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మండల టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ దుకాణాల నిర్వహణలో మార్పులు చేశామని ఉదయం 6 గంటల  నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, బార్లు, సినిమా హాల్ అనుమతించబడతాయి అని అన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి ఎవరికి వారు స్వచ్ఛందంగా మూసివేసి అధికారులకు సహకరించాలని కోరారు. పాలు, మెడికల్ షాపులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ఆటోలలో ముగ్గురు మాత్రమే ప్రయాణించాలని (డ్రైవర్ తో కలిపి) అన్నారు. పట్టణంలో పాజిటివ్ నిర్ధారణ  అయిన ఇంటి గోడ మీద పాజిటివ్ స్టిక్కర్ అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ చేయుటకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.


ప్రతి వారం పట్టణంలో కోవిడ్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణంలో హోటల్స్, రెస్టారెంట్లు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అనుమతించ బడతాయని, అన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పార్సిల్ మాత్రమే ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ కు పర్మిషన్ లేదని తీర్మానం చేశారు. బ్యాంకులో వారి ప్రస్తుత పనివేళల్లో మార్పు లేకుండా విధులు నిర్వహించుకోవాలని అన్నారు. ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అన్ని రకాల షాపులను మూసివేయాలని తీర్మానం చేశారు. వివాహాలకు 50 మంది, వేడుకలకు 20 మందితో తహసిల్దార్, ఇన్సిడెంట్ కమాండర్ వద్ద ముందస్తు అనుమతి తీసుకోవాలని తర్వాత మాత్రమే నిర్వహించుకోవాలి అన్నారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో కేర్ సెంటర్  ఏర్పాటు చేశామని ఇందులో 125 ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 45 మందికి సరిపడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పై నిబంధనలు వచ్చే నెల 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని, తదుపరి మండల టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తదుపరి ఉత్తర్వులు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి, డి.ఎస్.పి శ్రీనివాసులు తహసిల్దార్  సీతారామయ్య, మున్సిపల్ కమిషనర్ మనోహర్,  ఎంపిడిఓ విజయ్ శేఖర్, డాక్టర్లు ఇంద్రాణి, స్వాతి, పట్టణ, రూరల్ ఎస్ఐ లు తిరుపతి రావు, కొత్తపల్లి అంకమ్మ  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...