తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయము
తన గాడ్ ఫాధర్ పెద్దిరెడ్డి గారితో పాటు పార్టీ హై కమాండ్ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయమని శ్రీ బుల్లెట్ సురేష్ అన్నారు. అదేవిధంగా కార్పొరేటర్లు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. 42 వ డివిజన్ లో వైసిపి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏపీ మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుల్లెట్ సురేష్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా ఆయనను కార్పొరేటర్ శశి కుమార్ ఘనంగా ఆహ్వానించారు. బజారు వీధి, జండామాను వీధి లలో ర్యాలీ నిర్వహించి అనంతరం రేణుకమ్మన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ ప్రజలు పలుచోట్ల ఆయనకు మంగళహారతులు , గజమాలలతో స్వాగతం పలికారు. అనంతరం వన్నియర్ బ్లాక్ లో వైసిపి కార్యాలయాన్ని శ్రీ బుల్లెట్ సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. 42 వ డివిజన్ సచివాలయంలో కేక్ కట్ చేసి కార్యలయ సిబ్బందికి పంచిపెట్టారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శశికుమార్ మాట్లాడుతూ అత్యంత చిన్న వయస్సులో తనకు పార్టీ బీఫాం ఇప్పించడమే కాకుండా డివిజన్ లోని పెద్దలతో మాట్లాడి నన్ను ఏకగ్రీవంగా గెలిపించిన బిసిల ఆరాధ్య దైవం శ్రీ బుల్లెట్ సురేష్ గారికి జన్మ జన్మలా ఋణపడి ఉంటానని , అదే విధంగా అర్దరాత్రైనా సహాయం అని అడిగిన తన డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నవీన్ కుమార్, సహదేవన్ , శ్రీకాంత్, గడ్డం రమణ , దొడ్డిపల్లి సునీతా శివకుమార్, లక్ష్మణన్, ఇందు, ఏకాంబరం , గణేష్ మేస్త్రి స్దానిక నాయకులు పిచ్చాండి, మురుగా మేస్త్రి, శివకుమార్, ఆరుముగం మరియు బుల్లెట్ యూత్ సభ్యులు మురళి , ముత్తు, మగి, సూర్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment