పెద్దేవం పంచాయతీలో కరోన నియంత్రణపై అవగాహనా సదస్సు
పెద్దేవం గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి రంగనాయకమ్మ ఆధ్వర్యంలో గురువారం కరోనా నియంత్రణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి ఎం.రాజశేఖర్ మరియు ప్రెసిడెంట్ తిగిరిపల్లి వెంకటరావు విచ్చేసారు.
ఎంపిడిఓ రాజశేఖర్ మాట్లాడుతూ కరోన సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో కరోన నియంత్రణపై తగు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలియజేశారు. వీటన్నింటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలో ఉన్న వారికి తెలియజేశారు. ప్రెసిడెంట్ తిగిరిపల్లి వెంకట్రావు మాట్లాడుతూ అందరూ సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వాడుతూ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్వో సుజాత, వార్డు మెంబర్లు, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు, వాలంటరీలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment