రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శులను నియమించిన టిడిపి
పెన్ పవర్, విశాఖపట్నం
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శుల నియామకం చేపట్టింది. రాష్ట్రంలో ఏడుగురు తెలుగు యువత ప్రధాన కార్యదర్శిల నియామక పత్రాలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాడుగుల నియోజకవర్గం ముకుందపురంకు చెందిన కర్రీ సాయి కృష్ణ ను తిరుపతి నుంచి రాగుల ఆనంద్ హౌడ్ గుంటూరు నుంచి యల్లవల అశోక్ యాదవ్ అమలాపురం నుంచి చెరుకూరి సాయిరాం యలమంచిలి నుంచి ధర్మరెడ్డి నాయుడు విజయవాడ నుంచి కిలారు నాగశ్రావణ్ హిందూ పురం గుడిపాటి నారాయణ స్వామి లను నియమిస్తూ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నియామకం తో టీడీపీలో నూతన ఉత్తేజం నెలకొంది. పార్టీ బలోపేతానికి తమ వంతుగా కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కర్రీ సాయి కృష్ణతో ఏడుగురు ప్రధాన కార్యదర్శులు పార్టీ నాయకత్వానికి హమీఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తమ పట్ల నమ్మకంతో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిల బాధ్యతలు అప్పగించారని వాటిని తూచా అమలు చేస్తామని పేర్కొన్నారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నిక చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు టిడిపి పొలి.ట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి నాయకుడు బుద్దా నాగజగధీశ్వరరావు దేశం నాయకులకు కర్రి సాయి కృష్ణ కృతజ్ఞతలు తేలిపారు.
No comments:
Post a Comment