కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు విడనాడాలి
విజయనగరం,పెన్ పవర్కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు విడనాడి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ చేయించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మరోసారి స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని 5 ప్రాంతాలలో వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించారు. ఇస్మాయిల్ కాలనీ, మజ్జి పేట,ఓం మందిరం, కొత్తపేట గొల్లవీధి,ఉల్లివీధి లోని ఆర్యవైశ్య భవన్ ప్రాంతాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న తీరును కమిషనర్ వర్మ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అక్కడున్న సిబ్బందికి ఆదేశించారు.వేక్షినేషన్ వేసిన అనంతరం అరగంట సేపు వేచి ఉండే ప్రదేశంలో తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. వ్యాక్సినేషన్ అయిన తర్వాత కూడా తప్పనిసరిగా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవడం వంటి ప్రక్రియలు చేపట్టాలన్నారు.కరోనా రెండోదశ వ్యాప్తి లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉంటున్నారని కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మొదటి డోసు వ్యాక్సినేషన్ అయిన తర్వాత 28 రోజులకు మరలా వ్యాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. వేక్షినేషన్ అయిన తర్వాత కూడా ఏమరపాటు గా ఉండకూడదని చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనా దరిచేరకుండా జాగ్రత్త వహించాలన్నారు.
No comments:
Post a Comment