స్వరాష్ట్రంలో సింగరేణి అద్భుత ప్రగతి
మందమర్రి, పెన్ పవర్
స్వరాష్ట్రంలో సింగరేణి సంస్థ అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని మందమర్రి జిఎం ఏరియా చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్స్, ఎస్ అండ్ పిసి విభాగం, 33 కెవి సబ్ స్టేషన్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అవిర్భవానికి ముందు, తర్వాత సంస్థ సాధించిన పురోగతిని సవివరంగా వివరించారు. సంస్థ పురోభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ, పార్కులను, క్యాంటీన్లను, రెస్ట్ రూములను, మినరల్ వాటర్ ప్లాంట్లను, కమ్యూనిటీ హాల్స్, యోగ కేంద్రాలను అత్యాధునికంగా నిర్మించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం గోపాల్ సింగ్, ఏరియా ఇంజనీర్ (ఏజిఎం) జగన్మోహన్ రావు, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షులు జక్కారెడ్డి, ఏరియా పిఎం వరప్రసాద్, ఎఎస్ఎం ఓదేలు, ఐఈడి (డిజిఎం) రాజన్న, వర్క్ షాప్ డిజిఎం నరసింహ రాజు, ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి భీమనాథుని సుదర్శన్, ఫిట్ కార్యదర్శి సిహెచ్పి శర్మ,, టీబీజీకేఎస్ ఏరియా నాయకులు ఇప్ప సమ్మయ్య, ఫిట్ కార్యదర్శి ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment